నా ప్రతి పుట్టినరోజుకీ నావంతు సాయంగా సోషల్ సర్వీస్ చేయడం అలవాటు. చెన్నై నుంచి మొత్తంగా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. అందుకే.. ఇకనుంచి హైదరాబాద్‌లో నా సేవాకార్యక్రమాలు కొనసాగుతాయి.’ అని వరలక్ష్మీశరత్‌కుమార్ అన్నారు. మార్చి 5న(నేడు) ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా తన భర్త నికోలయ్ సచ్దేవ్తో కలిసి హైదరాబాద్‌లోని లెప్రా సొసైటీ అనాథ శరణాలయానికి వెళ్లి అక్కడి చిన్నారులతో సమయాన్ని గడిపి, వారికి బహుమతుల్ని అందజేశారు వరలక్ష్మీ శరత్‌కుమార్. అనంతరం తన భర్తతో కలిసి శరణాలయానికి డొనేషన్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె ఇంకా మాట్లాడుతూ ‘చాలామందికి ఈ అనాథ శరణాలయం గురించి తెలీదు. మాలాంటి సెలబ్రిటీలు ఇక్కడకి రావడం వల్ల ఈ ఆర్ఫనేజ్‌కు గుర్తింపు వస్తుంది. తద్వారా జనాలకు తెలుస్తుందనే ఉద్దేశ్యంతో ఈ రోజు ఇక్కడకు వచ్చాం. ఈ ఆర్ఫనేజ్‌లో చాలామంది ఆడబిడ్డలు ఉన్నారు. ఒక్క ఈ బ్రాంచ్‌లోనే 62మంది చిన్నారులున్నారు. దయచేసి అందరం హెల్పింగ్ హ్యాండ్స్ అందిద్దాం. కుదిరినప్పుడల్లా ఈ చిన్నారులను కలుద్దాం. మనం చేసే చిన్న సాయం కూడా వీరికి గొప్ప సంతోషాన్నిస్తుంది’ అన్నారు వరలక్ష్మి. మనకున్నదాంట్లో సాయం చేస్తే.. ఈ ప్రపంచం మళ్లీ మనకు సాయపడుతుందని వరలక్ష్మీ శరత్‌కుమార్ భర్త నికోలయ్ సచ్దేవ్ తెలిపారు.