అనిల్ అర్కా, నిహారికా చౌదరి జంటగా రూపొందిన యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ‘వారధి’. శ్రీకృష్ణ దర్శకుడు. పెయ్యాల భారతి, ఎం.డి.యూనస్ నిర్మాతలు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ‘ఇది యూత్‌కి నచ్చే లవ్ అండ్ రొమాటిక్ థ్రిల్లర్. ప్రేమ, భావోద్వేగాలు, సస్పెన్స్ అంశాల కలబోత ఈ సినిమా. నటీనటుల అభినయం, సాంకేతిక నిపుణుల కృషి ఈ చిత్రానికి ప్రధాన బలాలు. ‘వారధి’ ఈ తరం ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్‌గా నిలుస్తుంది.’ అని దర్శకుడు చెప్పారు. ప్రశాంత్ మడుగుల, రిధి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రచన: నాగేంద్ర పలగాని, కెమెరా: శక్తి.జె.కె, సంగీతం: షారుఖ్ షేక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బి.ఎన్.చందు.