అందాన్ని, అభినయాన్ని ప్రేక్షకులకు తెరపై పంచే బాలీవుడ్ తారల్లో ఒకరు వాణీకపూర్. అందుకే ఆమెకు అన్ని రకాల పాత్రలు దక్కుతుంటాయి. వాణీ కపూర్ తాజా సినిమా ‘షంషేరా’. రణబీర్ కపూర్ హీరోగా నటించారు. సంజయ్ దత్ విలన్‌గా కనిపించనున్నారు. ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలైంది.
ఇందులో సోనా పాత్రలో కనిపించి ఆకట్టుకుంది వాణీ కపూర్. ఈ పాత్ర గురించి ఆమె మాట్లాడుతూ…‘కథలో కీలకంగా ఉండే పాత్రల్లో నటించడానికి ఇష్టపడతా. ‘షంషేరా’లో సోనా పాత్ర అలాంటిదే. ఈ క్యారెక్టర్లో నేను మెప్పించగలను అని నమ్మిన దర్శకుడు కరణ్ మల్హోత్రాకు థాంక్స్. రణబీర్ కపూర్‌తో నటించడం సంతోషంగా ఉంది. కెమెరా ముందు అతనో పవర్‌హౌస్’ అని చెప్పింది. ఈ సినిమా జూలై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.