నిజంగానే పవన్ అభిమానులకు ఇంతకంటే పెద్ద సర్ ప్రైజ్ ఉండదేమో..? ఇంకా వకీల్ సాబ్ సినిమాను చూడని వాళ్లు కరోనా కారణంగా థియేటర్స్ కు ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తున్నారు. అలాంటి వాళ్లకు ఇప్పుడు సర్ ప్రైజ్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. ఏప్రిల్ 30న వకీల్ సాబ్ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయబోతున్నారు. అయినా ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా కూడా ఓటిటిలో చాలా త్వరగా వచ్చేస్తుంది. మొన్నటికి మొన్న కన్నడలో పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన యువరత్న సినిమా కేవలం వారం రోజుల్లోనే ఓటిటిలో విడుదల చేసారు.
ఈ మధ్య తెలుగులోనూ అలా రెండు వారాల్లోనే సినిమాలు విడుదలైన సందర్భాలు ఉన్నాయి. క్రాక్ మూడు వారాలకు.. మాస్టర్ రెండు వారాలకు ఓటిటిలో వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా కూడా మూడు వారాల్లోనే ఓటిటిలో వచ్చేస్తుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన వకీల్ సాబ్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. ఈ సినిమా ఇప్పటి వరకు 85 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. 90 కోట్ల టార్గెట్‌తో దిగిన వకీల్ సాబ్ కాస్త దూరంలోనే ఆగిపోయింది.
కరోనా కారణంగా లక్ష్యానికి దూరంగా నిలిచిపోయింది. బయట పరిస్థితులు కూడా బాగోలేకపోవడంతో ఈ సినిమాను అనుకున్న దానికంటే ముందుగానే ఓటిటిలో విడుదల చేస్తున్నారు. వకీల్ సాబ్ విడుదలైన 14 రోజులకే ఓటిటిలో వచ్చేస్తుందంటూ ముందు నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. వీటిని దర్శక నిర్మాతలు ఖండించారు. అందులో నిజం లేదని తెలిపారు. కానీ రెండు వారాలు కాదు మూడు వారాలకు ఈ సినిమా వస్తుందది. ఎప్రిల్ 30న వకీల్ సాబ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేస్తుందంటూ పోస్టర్‌తో పాటు ట్రైలర్ కూడా వచ్చేసింది. ఏదేమైనా కూడా అభిమానులకు ఇది నిజంగానే తీపికబురు.
In the hall of justice, he will turn black to white.
— amazon prime video IN (@PrimeVideoIN) April 27, 2021
New trailer out now!
Meet #VakeelSaabOnPrime on April 30. @PawanKalyan #SriramVenu @shrutihaasan @i_nivethathomas @yoursanjali @AnanyaNagalla @SVC_official @MusicThaman @bayviewprojoffl @BoneyKapoor pic.twitter.com/uz0tjoYHAR
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
కొవిడ్ సెకండ్ వేవ్ భిన్నం.. వచ్చే 4 వారాలు ఎందుకు కీలకమంటే..?
Corona effect : భారత్ నుంచి ప్రయాణాలపై ఆస్ట్రేలియా ఆంక్షలు
దేశంలో అందుబాటులోకి మరో టీకా.. జైడస్ క్యాడిలా టీకాకు డీసీజీఐ అనుమతి
మే మూడో వారంలో కరోనా మరింత ఉద్ధృతం: ఎస్బీఐ రిపోర్ట్
గుజరాత్ లో దారుణం : కొవిడ్ బెడ్ కోసం రూ 9000కు బేరం
బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?
Corona effect : ఆక్సిజన్ లెవల్స్ ఎలా పెంచుకోవాలి