Vaishnavi Chaitanya | అదేంటో ఒక్కో సారి ఎన్ని సినిమాలు చేసిన పలువురు హీరోయిన్లకు పెద్దగా గుర్తింపు ఉండదు. అదే కొందరి విషయంలో మాత్రం ఒకటి, రెండు సినిమాలతో ఊహించని రేంజ్‌కు వెళ్లిపోతుంటారు. అలా ఊహించని స్థాయికి వెళ్లిపోయిన నటి వైష్ణవి చైతన్య. బేబి సినిమాతో వైష్ణవికి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అందం, అభినయంతో పాటు నటనను కూడా అలవోకగా చేసే ఈ అమ్మాయి గురించి ఇప్పుడు ఇండస్ట్రీయే మాట్లాడుకుంటుంది. ఈ సినిమా సక్సెస్‌తో వైష్ణవి ఇంటి గుమ్మం వద్దకే బోలెడు ఆఫర్స్ వస్తున్నాయి. అయితే ఈ బ్యూటీ మాత్రం అవకాశం వచ్చింది కదా అని అన్నిటికీ ఒప్పేసుకోకుండా.. తన కెరీర్‌కు ప్లస్ అయ్యే కథలను మాత్రమే ఎంచుకుంటూ వస్తుందట.
ఇన్సైడ్ టాక్ ప్రకారం వైష్ణవి ప్రస్తుతం రెండు పెద్ద బ్యానర్లలో సినిమాలు కమిట్ అయింది. అందులో ఒకటి ఎస్వీసీసీ సంస్థ. తొలిప్రేమ, విరూపాక్ష లాంటి సినిమాలు నిర్మించిన ఈ సంస్థలో వైష్ణవి ఓ సినిమా చేయబోతుందట. అంతేకాకుండా ఇందులో హీరో సిద్దూ జొన్నలగడ్డ నట. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా గనుకు హిట్టయితే మాత్రం బేబి హీరోయిన్ కెరీర్ రాకెట్లా దూసుకుపోవడం ఖాయం. ఇక రెండోది దిల్‌రాజు బ్యానర్లో. రౌడీ బాయ్స్ హీరో ఆశిష్ రెడ్డి హీరోగా దిల్‌రాజు ఓ సినిమా చేస్తున్నాడు. అందులో హీరోయిన్గా వైష్ణవినే ఫిక్స్ చేశారట. ఈ సినిమాకు అరుణ్ భీమవరపు దర్శకుడు.
ఇలా వైష్ణవి తెలివిగా ఆఫర్స్ వస్తున్నాయి కదా అని అన్నిటిని టచ్ చేయకుండా తన కెరీర్‌కు ఏది ప్లస్ అవుతుందో అదే ఎంచుకుంటూ చాకచక్యం వహించింది. ఈ రెండు బ్యానర్లలో సినిమాలలో చేయబోయే సినిమలు క్లిక్ అయితే మట్టుకు వైష్ణవి బిజీ హీరోయిన్గా మారడం పక్కా.