‘బేబీ’.. అనగానే ముందు గుర్తొచ్చే రూపం వైష్ణవి చైతన్య. ఆ ఒక్క సినిమాతో రెండు తెలుగురాష్ర్టాల యువతనీ తనవైపు తిప్పుకున్నది ఈ అచ్చతెలుగందం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే తత్వం కాదు వైష్ణవి చైతన్యది. ‘బేబీ’ తర్వాత సినిమాలు క్యూ కట్టినా.. ఆచితూచి అడుగులు వేస్తూ.. నచ్చిన పాత్రలనే ఎంచుకుంటూ ఓ ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నది ఈ అందాలభామ. సిద్ధు జొన్నలగడ్డకు జోడీగా ఆమె నటించిన ‘జాక్’ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమె ద్విపాత్రాభినం చేయస్తున్నట్టు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక హీరోయిన్‌కి ద్విపాత్రాభినయం చేసే అవకాశం రావడం అరుదే. ఆ అరుదైన ఛాన్స్‌ని వైష్ణవి కొట్టేసింది. ఈ సినిమా తర్వాత సూపర్‌హిట్ వెబ్‌సిరీస్ ‘90s ఏ మిడిల్‌క్లాస్ బయోపిక్’ సీక్వెల్‌గా రూపొందుతున్న సినిమాలో ఆనంద్ దేవరకొండకు జోడీగా వైష్ణవి నటించనున్నది. సితార ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇలా బడా సంస్థలు నిర్మిస్తున్న చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తూ బిజీబిజీగా ఉన్నది వైష్ణవి చైతన్య. తాజాగా ఈ తెలుగమ్మాయి ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ కూడా చేసింది. ఈ ఫొటోల్లో యువరాణిలా మెరిసిపోతున్న వైష్ణవి చైతన్యను చూడొచ్చు.