Vaishnavi Chaitanya | ‘బేబీ’ చిత్రం కథానాయిక వైష్ణవి చైతన్య కెరీర్‌ను మలుపుతిప్పింది. ఈ సినిమాలో ఆమె అభినయానికి మంచి ప్రశంసలు దక్కాయి. ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు వరించింది. ప్రస్తుతం సినిమాల ఎంపికలో సెలెక్టివ్‌గా ఉంటూ కథాబలమున్న చిత్రాలనే అంగీకరిస్తున్నది వైష్ణవి చైతన్య. ప్రస్తుతం ఈ భామ తెలుగులో సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘జాక్’ చిత్రంలో నటిస్తున్నది. మరికొన్ని పెద్ద చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సొగసరికి తమిళం, కన్నడ ఇండస్ట్రీల నుంచి కూడా భారీ ఆఫర్లొస్తున్నట్లు తెలిసింది.
అక్కడ రెండు చిత్రాలకు ఆమె సైన్ చేశారని సమాచారం. ఈ ఏడాది తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా మంచి విజయాలను సొంతం చేసుకుంటానని ధీమా వ్యక్తం చేస్తున్నది వైష్ణవి చైతన్య. సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో తన సినిమాలకు సంబంధించిన విశేషాలను పంచుకుంటుంది వైష్ణవి చైతన్య. తాజాగా ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ కొత్త ఏడాది నటిగా తనను మరో మెట్టెక్కిస్తుందనే నమ్మకంతో ఉంది వైష్ణవి చైతన్య.