Vaishnav Tej | మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హిట్టు కొట్టి రెండేళ్లయింది. ఉప్పెన తర్వాత రిలీజైన రెండు సినిమాలు డిజాస్టర్లుగా మిగిలాయి. ఉప్పెన వంద కోట్ల గ్రాస్ సాధిస్తే.. ఆ తర్వాత రిలీజైన రెండు సినిమాలు కలిపి కూడా రూ.50కోట్ల గ్రాస్ కూడా సాధించలేకపోయాయి. ప్రస్తుతం వైష్ణవ్ సితార ఎంటర్టైనమెంట్స్ బ్యానర్లో ఓ యాక్షన్ సినిమా చ్తేస్తున్నాడు. శ్రీకాంత్ దర్శకుడిగా పరిచయమవుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన డైలాగ్ గ్లింప్స్ సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా మేకర్స్ ఈ సినిమా బిగ్ అప్డేట్ను ప్రకటించింది.
ఈ సినిమా గ్లింప్స్‌ను మే 15 సాయంత్రం 4గంటల 5 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల, అపర్ణదాస్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను సితార సంస్థతో కలిసి తివిక్రమ్ తన సొంత బ్యానర్ ఫ్యార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
A Fiery first glimpse into the world of #PVT04! 🔥😈⚡️
From 15th May at 04:05pm 💥 #PVT04FirstGlimpse#PanjaVaisshnavTej @sreeleela14 @gvprakash #JojuGeorge @aparnaDasss #SrikanthNReddy @NavinNooli @dudlyraj @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/LECymr88Oi
— Sithara Entertainments (@SitharaEnts) May 13, 2023