PVT4 | ఉప్పెన సినిమాతో తొలి ఎంట్రీలోనే బ్లాక్ బాస్టర్ హిట్టందుకున్నాడు పంజా వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej). ఈ యువ హీరో చాలా రోజుల క్రితం PVT 4 ప్రాజెక్టును లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. శ్రీకాంత్ ఎన్ రెడ్డి కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. పక్కా మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పెళ్లి సందD ఫేం శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది.
కాగా ఈ చిత్రంలో మరో ఫీ మేల్ రోడ్లో ఎవరు కనిపించబోతున్నారనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. బీస్ట్ ఫేం అపర్ణా దాస్ ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇందులో వజ్ర కాళేశ్వరి దేవి పాత్ర పోషిస్తోంది అపర్ణా దాస్. తెలుగులో అపర్ణా దాస్‌కు ఇది మొదటి సినిమా. అపర్ణా దాస్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తుండటం ఎక్జయిటింగ్‌గా ఉంది. రీసెంట్గా నటించిన దాదా సక్సెస్ అయిన సందర్భంగా అపర్ణా దాస్‌కు శుభాకాంక్షలు. PVT 4లోకి తీసుకోవడం థ్రిల్లింగ్‌గా ఉంది.. అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు.
సితార ఎంటర్టైన్ మెంట్స్ (Sithara Entertainments)-ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లు PVT 4ను సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ సినిమా ఎలా ఉండబోతుందతో తెలియజేస్తూ.. మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్ వీడియో (PVT4 Glimpse Video) నెట్టింట హల్ చల్ చేస్తోంది.
‘రేయ్ రాముడు లంక మీద పడటం ఇనుంటావ్..అదే పది తలకాయలు ఊడి అయోధ్య మీద పడితే ఎట్టుంటాదో చూస్తావా..అని విలన్ అంటుంటే..ఈ అయోధ్యలో ఉండేది రాముడు కాదప్ప.. ఆ రాముడినే కొలిచే రుద్ర కాలేశ్వరుడు..తలలు కోసి చేతికిస్తా నా యాళ’ అంటూ సాగే డైలాగ్స్‌తో సాగుతున్న గ్లింప్స్ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ప్రొడక్షన్ నంబర్ 16గా తెరకెక్కుతున్న ఈ మూవీని 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మూవీని నాగవంశి, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
Excited to announce that @aparnaDasss will be making her Telugu cinema debut as “Vajra Kaleshwari Devi” in #PVT04 🔥
Congratulations on your recent blockbuster #Dada, We’re thrilled to have you on board 🤩#PanjaVaisshnavTej @sreeleela14 #JojuGeorge #SrikanthNReddy @vamsi84… pic.twitter.com/kDYobYiO4x
— Fortune Four Cinemas (@Fortune4Cinemas) May 10, 2023
PVT4 గ్లింప్స్ వీడియో..
#PVT04 ~ #ProductionNo16 begins with a pooja ceremony today✨
Shoot begins soon! 🎬🎥
Directed by #SrikanthNReddy
Produced by @vamsi84 & #SaiSoujanya#PanjaVaisshnavTej @sreeleela14 @SitharaEnts @Fortune4CinemasSankranthi 2023 Release ⚡ pic.twitter.com/UxGDdh35Wm
— Sithara Entertainments (@SitharaEnts) June 22, 2022