వైష్ణవ్‌తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదికేశవ’. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని నవంబర్ 10న విడుదల చేయబోతున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాం.
ఇటీవలే పారిస్‌లో కొంతభాగం షూటింగ్ పూర్తి చేశాం. వైష్ణవ్‌తేజ్ మునుపెన్నడూ చూడని కొత్త పంథాలో కనిపిస్తారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం ప్రధానాకర్షణగా నిలుస్తుంది. తొలి గీతాన్ని త్వరలో విడుదల చేయబోతున్నా ’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.