Aadi keshava | టాలీవుడ్ యాక్టర్ పంజా వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) నటిస్తోన్న తాజా చిత్రం ఆదికేశవ (Aadikeshava). PVT 4గా వస్తున్న ఈ మూవీకి శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్ టైటిల్‌ను ఫైనల్ చేస్తూ.. రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లింప్స్ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో పెండ్లి సందD ఫేం శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఆదికేశవ ముందుగా నిర్ణయించిన ప్రకారం ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ విడుదల వాయిదా పడింది.
తాజాగా కొత్త రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. కొన్ని విలువైన కథల కోసం నిరీక్షించే సమయం.. అంటూ నవంబర్ 10న ఆది కేశవను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. రిలీజ్ అప్డేట్ న్యూ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఫస్ట్ గ్లింప్స్‌లో ‘రేయ్ రాముడు లంక మీద పడటం ఇనుంటావ్..అదే పది తలకాయలు ఊడి అయోధ్య మీద పడితే ఎట్టుంటాదో చూస్తావా..అని విలన్ అంటుంటే..ఈ అయోధ్యలో ఉండేది రాముడు కాదప్ప.. ఆ రాముడినే కొలిచే రుద్ర కాలేశ్వరుడు.. తలలు కోసి చేతికిస్తా నా యాళ..’అంటూ సాగుతూ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
PVT 4 అనౌన్స్మెంట్ గ్లింప్స్‌లో మా గుడి జోలికి మాత్రం రాకండయ్యా.. శివుడికి కోపమొస్తే ఊరికి మంచిది కాదని విధ్వంసం సృష్టించేందుకు వచ్చిన రౌడీలతో పూజారి అంటుండగా.. వైష్ణవ్ తేజ్ ఆ రౌడీల అంతు చూసే యాక్షన్ సన్నివేశాలు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ మూవీలో బీస్ట్ ఫేం అపర్ణా దాస్ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ చిత్రానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
ఈ ప్రాజెక్ట్‌ను సితార ఎంటర్టైన్ మెంట్స్ (Sithara Entertainments)-ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. నాగవంశి, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
PVT4 గ్లింప్స్ వీడియో..
ఆది కేశవ ఫస్ట్ గ్లింప్స్ వీడియో..
Certain stories are worth the anticipation and time! 🔥#Aadikeshava will arrive in theaters from November 10, 2023! 🤩#AadikeshavaOnNov10th 💥#PanjaVaisshnavTej @sreeleela14 @gvprakash #JojuGeorge @aparnaDasss #SrikanthNReddy @NavinNooli @dudlyraj @vamsi84 #SaiSoujanya… pic.twitter.com/LlLPcZzFJD
— Sithara Entertainments (@SitharaEnts) August 18, 2023