Vadhuvu | అవికా గోర్ ‘వధువు’ స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. ఆసక్తికరంగా టీజర్.!
Vadhuvu | ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో కథానాయికగా తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకుంది బాలీవుడ్ బుల్లితెర నటి అవికాగోర్ (Avika Gor). ఇక ఇటీవలే మ్యాన్షన్ 24 (Mansion 24) అనే వెబ్ సిరీస్‌లో నటించిన అవికా తన నటనతో అలరించింది.
Vadhuvu | ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో కథానాయికగా తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకుంది బాలీవుడ్ బుల్లితెర నటి అవికాగోర్ (Avika Gor). ఇక ఇటీవలే మ్యాన్షన్ 24 (Mansion 24) అనే వెబ్ సిరీస్‌లో నటించిన అవికా తన నటనతో అలరించింది. ఇదిలా ఉంటే.. తాజాగా అవికా మరో ఓటీటీ వెబ్ సిరీస్‌తో వస్తోంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘వధువు’(Vadhuvu). మ్యారేజ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్స్ అనేది క్యాప్షన్. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ పెళ్లి జరగదన్నయ్యా. ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరగాలి. కొత్త కోడలికి ఇంట్లో విషయాలు ఏమి తెలియకూడదు. అంటూ బ్యాక్ గ్రౌండ్ వాయిస్‌లతో ఈ టీజర్ సాగింది. ఇక ఈ టీజర్ గమనిస్తే.. పెద్ద కుటుంబాల్లో ఎలాంటి రహస్యాలు ఉంటాయి? అవి బయటపడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అనేదే ఈ సిరీస్ స్టోరీ అని అర్థమవుతోంది. ఇక ఈ రహస్యాలను అవికా కనుగొంటుందా.. మిస్టరీని ఛేదిస్తుందా అనేది తెలియాలంటే వధువు చూడాల్సిందే.
ఈ సిరీస్‌లో బిగ్‌బాస్ ఫేమ్ అలీ రెజా, నందు కూడా కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ+ హాట్‌స్టార్‌లో డిసెంబర్ 08 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు.
#Vadhuvu Streaming From Dec 8th On Disney Plus Hotstar pic.twitter.com/h2wPiCVxjT
— siddu (@UrsViswanadh) November 14, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

