Transfer Trimurthulu | ప్రముఖ తెలుగు నటుడు వడ్డే నవీన్ చాలా రోజుల తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘టాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ (Transfer Trimurthulu). ఈ సినిమాకు కమల్ తేజ నార్ల దర్శకత్వం వహిస్తుండగా వడ్డే క్రియేషన్స్ బ్యానర్‌పై వడ్డే నవీనే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వడ్డే నవీన్‌తో పాటు వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. నేడు రాఖీ పండుగ సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ చిత్రంలో వడ్డే నవీన్ కానిస్టేబుల్ పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.
From silver screen memories to a bold new avatar ✨#VaddeNaveen garu is back — ruling hearts & the screen again, in khaki style!👮🏻♂️
Proudly presenting the #FirstLook of @vaddecreations Production No 1- #TransferTrimurthulu ❤️🔥@vaddenaveen @RashiReal_ @MeeKamalTeja @vamsikaka pic.twitter.com/IqfGjFdkgx
— Maduri Mattaiah Naidu (@madurimadhu1) August 9, 2025