Vadde Naveen | అల్లు అర్జున్ ఎదుగుదల అద్భుతం.. ‘పుష్ప’ సెన్సేషన్ ఎవరూ ఊహించలేదు: వడ్డే నవీన్
Vadde Naveen | ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఎంతో దగ్గరైన హీరోల్లో వడ్డే నవీన్ ఒకరు. తనదైన శైలిలో భావోద్వేగభరితమైన కథలు, కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు.
Vadde Naveen | ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఎంతో దగ్గరైన హీరోల్లో వడ్డే నవీన్ ఒకరు. తనదైన శైలిలో భావోద్వేగభరితమైన కథలు, కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తూ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. వడ్డే నవీన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ఈ సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆయన ప్రస్తుతం ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ సినిమా కోసం ఎంతో ఉత్సాహంగా పనిచేశానని వడ్డే నవీన్ తెలిపారు. కెరీర్లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న భావన కలుగుతోందని, ప్రేక్షకులు తనను మళ్లీ ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు. సినిమా షూటింగ్ సమయంలో ఎంత ఎనర్జీతో పనిచేశానో, ఇప్పుడు ప్రమోషన్లలో కూడా అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తున్నానని చెప్పారు. ఇంటర్వ్యూలో భాగంగా ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి, పాన్ ఇండియా మార్కెట్ గురించి మాట్లాడిన వడ్డే నవీన్, ముఖ్యంగా అల్లు అర్జున్ ఎదుగుదలను ప్రశంసించారు. గత పదేళ్లలో అల్లు అర్జున్ సాధించిన విజయాలు నిజంగా అద్భుతం. ఆయన కెరీర్ గ్రోత్ చాలా ప్రత్యేకంగా ఉంది. తెలుగు సినిమాను దేశవ్యాప్తంగా తీసుకెళ్లిన హీరోల్లో ఆయన కూడా ఒకరు అని అన్నారు.
తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి చేరుకోవడంపై మాట్లాడిన వడ్డే నవీన్, బాహుబలి మరియు పుష్ప సినిమాల విజయాలను పోల్చుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాహుబలి విజయం కొంతవరకు ఊహించిందే. ఎందుకంటే ఆ సినిమా స్కేల్, విజువల్స్, కథనం అన్నీ చాలా పెద్ద స్థాయిలో రూపొందించబడ్డాయి. అలాంటి సినిమా దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుందని ముందే అంచనా వేయొచ్చు అని అన్నారు.అయితే ‘పుష్ప’ విషయంలో పరిస్థితి పూర్తిగా భిన్నమని పేర్కొన్నారు. పుష్ప సినిమా సాధించిన క్రేజ్, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో వచ్చిన ఆదరణ నిజంగా ఆశ్చర్యకరమైనది. ఆ స్థాయి రెస్పాన్స్‌ను చాలామంది ఊహించి ఉండరు. ఒక్కసారిగా అల్లు అర్జున్‌కు దేశవ్యాప్తంగా వచ్చిన గుర్తింపు ప్రత్యేకమైనది అని వడ్డే నవీన్ అభిప్రాయపడ్డారు. పుష్ప పాత్ర, డైలాగ్స్, మేనరిజమ్స్, పాటలు దేశమంతటా వైరల్ కావడం వల్ల అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా మారారని ఆయన తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

