Bhartha Mahasayulaku Wignyapthi | మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. క్లాస్ చిత్రాల దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా మేకర్స్ తాజాగా ఈ సినిమాలోని ‘వామ్మో.. వాయ్యో..’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియా తనదైన మాస్ బీట్స్‌తో స్వరపరిచిన ఈ పాటకు దేవ్ పవార్ సాహిత్యం అందించగా, స్వాతిరెడ్డి తన గాత్రంతో పాటకు మరింత హుషారుని తీసుకువచ్చారు. రవితేజ సరసన ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతీ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం కిషోర్ తిరుమల మార్కు ఎమోషన్స్‌తో పాటు, రవితేజ బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా సాగే పక్కా కామెడీ ఎంటర్టైనర్గా ఉండబోతోంది.