‘సమాంతర ప్రపంచంలో జరిగే సూపర్ హీరో సినిమా ఇది. గతంలో నేను సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రల్ని చేశాను. కానీ ఇందులో నా పాత్రను విభిన్నంగా డిజైన్ చేశారు. కాల్పనిక ప్రపంచంలో జరిగే ఈ కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది’ అని అన్నారు అగ్ర హీరో కార్తి. ఆయన తమిళంలో నటించిన ‘వా వాతియార్’ చిత్రం తెలుగులో ‘అన్నగారు వస్తారు’ పేరుతో ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొస్తున్నది. ఈ సందర్భంగా బుధవారం కార్తి విలేకరులతో సినిమా విశేషాలను పంచుకున్నారు.