Kerala Politics | కేరళకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే, మాజీ కేంద్ర మంత్రి వి. మురళీధరన్ చేసిన ఒక పని ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర వివాదానికి దారితీసింది. కేరళలోని పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా తిరువనంతపురంలోని కట్టేల మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ అనే గిరిజన, వెనుకబడిన వర్గాల పిల్లలు చదివే పాఠశాలలో ఒక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన వి. మురళీధరన్ విద్యార్థులకు చాక్లెట్లను నేరుగా వారి చేతులకు ఇవ్వకుండా, బెంచీలపై పెడుతూ, విసురుకుంటూ వెళ్లడం వివాదాస్పదమైంది. ముఖ్యంగా ఇందులో చాక్లెట్లు పంచేముందు ఒక చిన్నారి చేయిచాచగా.. బెంచ్‌పై మురళిధరన్ వేయడం పలువురికి ఆగ్రహానికి తెప్పించింది. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో దళిత, గిరిజన సంఘాల నేతలు, సామాజిక విశ్లేషకులు మరియు ప్రతిపక్ష పార్టీల నాయకులు, నెటిజన్లు ఆయనపై తీవ్రంగా మండిపడుతున్నారు.
విద్యార్థులను తాకకూడదనే ఉద్దేశంతోనే ఆయన అలా బెంచీలపై చాక్లెట్లు వేశారని, ఇది ముమ్మాటికీ కులాహంకారం, అంటరానితనం కిందకే వస్తుందని విమర్శకులు ఆరోపిస్తున్నారు. మనసులో మనుస్మృతి ఆలోచనలు ఉండటం వల్లే మనుషులను తాకడానికి ఇష్టపడట్లేదా అంటూ సీపీఐ(ఎం) ఎంపీ ఏఏ రహీమ్ కూడా దీనిపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. కుక్కలకు అన్నం పెట్టినట్లుగా, పిల్లల ముందు చాక్లెట్లను విసిరేయడం వారి మానవ హక్కులను, ఆత్మగౌరవాన్ని భంగపరచడమేనని దళిత హక్కుల కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తూ, మురళీధరన్ ఆ గిరిజన పిల్లలకు మరియు కేరళ సమాజానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని పలువురు మాజీ మంత్రులు, రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కేరళ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతోంది.
Kerala BJP MLA practises Untouchability
Throws Chocolate in front of Tribal Students. pic.twitter.com/eXd0m7hwFJ
— Dr Ranjan (@DocRGM) June 3, 2026