వరుణ్‌తేజ్ కథానాయకుడిగా హారర్ కామెడీ కథాంశంతో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘VT 15’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్నది. ఇండియన్, కొరియన్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకుడు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నది. త్వరలోనే టైటిల్‌ను, ఫస్ట్ గ్లింప్స్‌ని విడుదల చేయనున్నట్టు సోమవారం ఓ ప్రకటన ద్వారా మేకర్స్ తెలియజేశారు.
వరుణ్‌తేజ్ కెరీర్లోనే ఇది స్పెషల్ మూవీ అని, ఇందులో ఆయన పాత్ర విభిన్నంగా ఉంటుందని, ఇప్పటికే ఇండియాతో పాటు విదేశాల్లో మూడు మేజర్ షెడ్యూల్స్ పూర్తి చేశామని, త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. తమన్ సంగీత దర్శకత్వంలో ఇప్పటికే రెండు పాటల రికార్డింగ్ పూర్తయిందని, ‘తొలిప్రేమ’ తర్వాత వరుణ్‌తేజ్, తమన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇదేనని మేకర్స్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్య కీలక పాత్ర పోషిస్తున్నారు.