విజయ్, శ్రావ్య జంటగా దర్శకుడు రాజారెడ్డి పానుగంటి రూపొందిస్తున్న సినిమా ‘ఉత్తమ విలన్’ కేరాఫ్ మహదేవపురం. ఈ చిత్రాన్ని సాయి లక్ష్మినారాయణ గౌడ్, పి శ్రవణ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ…‘లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా మా చిత్రాన్ని నిర్మించాం. మహదేవపురంలో ఉత్తమ విలన్ ఎవరు అనేది సినిమాలో చూడాలి. అన్ని వాణిజ్య అంశాలతో ఓ కొత్త కథను ప్రేక్షకులకు చూపించబోతున్నాం. కొత్త నటీనటులైనా ఆకట్టుకునేలా నటించారు. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం’ అన్నారు.