‘ ‘ఉత్సవం’ రెస్పెక్టబుల్ సబ్జెక్ట్. నిజంగా గర్వంగా చెప్పుకునే సినిమా. ఇదొక వండర్ఫుల్ జర్నీ. ఇందులో కథే హీరో. రాజేంద్రప్రసాద్, నాజర్, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం వంటి గొప్ప నటులు ఇందులో భాగమయ్యారు. వారినుంచి చాలా నేర్చుకున్నా.’ అంటున్నారు హీరో దిలీప్ ప్రకాశ్. ఆయన కథానాయకుడిగా రెజీనా కసాండ్రా కథానాయికగా రూపొందిన చిత్రం ‘ఉత్సవం’. అర్జున్‌సాయి రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సురేశ్ పాటిల్ నిర్మాత.
ఈ నెల 13న మైత్రీమూవీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో దిలీప్ ప్రకాశ్ విలేకరులతో ముచ్చటించారు. ‘ఇది రూట్స్‌ని గుర్తుచేసే సినిమా. రంగస్థల కళాకారుల నేపథ్యంలో సినిమా ఉంటుంది. సినిమా వచ్చిందే నాటకం నుంచి. ఆ ప్రభావం కథలో ఉంటుంది. అలాగే ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్ కూడా ఉంటాయ్. అనూప్ రూబెన్స్ ఇచ్చిన మంచి సంగీతం ఆడియన్స్‌ని కట్టిపడేస్తుంది. మొత్తంగా ఇదో ఫీల్‌గుడ్ సినిమా’ అని దిలీప్ ప్రకాశ్ చెప్పారు.