Ustad Bhagath Singh Glimps | మొన్నటి వరకు ‘హరిహర వీరమల్లు’ ఒక్కటే చేతిలో ఉందనుకుంటే.. ఈ ఏడాది ఏకంగా మరో మూడు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లి అందరినీ షాక్‌కు గురిచేశాడు పవన్ కళ్యాణ్. రానున్న ఎలక్షన్ల దృష్ట్యా వీలైనన్ని సినిమాలను పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ తన డేట్స్‌ను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం పవన్ లైనప్‌లో ఉన్న ప్రాజెక్ట్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. పదకొండేళ్ల క్రితం వీళ్ల కాంబోలో వచ్చిన గబ్బర్‌సింగ్ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దాంతో ఈ ప్రాజెక్ట్‌పై ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ బిగ్ అప్డేట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మే 11న గబ్బర్‌సింగ్ మూవీ 11ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉస్తాద్ భగత్‌సింగ్ గ్లింప్స్‌ను విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో నిజమెంతుందో తెలియదు కాదు ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అంతేకాకుండా ట్విట్టర్లో ట్రెండింగ్ కూడా అవుతుంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో పవన్‌కు జోడీగా శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది.
Get Ready With your Targets To Shake the Whole Social media 💪#UstaadBhagatSingh pic.twitter.com/CUYVYx8Ife
— Lets OTT (@IetsOTT) April 30, 2023