ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ పరిపాలనా వ్యవహారాల్లో బిజీగా ఉండటం వల్ల అగ్ర హీరో పవన్‌కల్యాణ్ నటిస్తున్న సినిమా షూటింగ్స్ అన్నీ వాయిదా పడుతూ వచ్చాయి. ప్రస్తుతం ఆయన రాజకీయ వ్యవహారాల్ని చూసుకుంటూనే సినిమాల కోసం కూడా కాస్త సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇప్పటికే ‘హరిహరవీరమల్లు’ షూటింగ్‌ని పూర్తి చేశారు కూడా. ప్రస్తుతం ‘ఓజీ’ షూటింగ్లో ఆయన బిజీగా ఉన్నారు.
తాజాగా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షూటింగ్‌ను కూడా జూన్‌లో మొదలుపెట్టనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. హరీష్‌శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. ఇందులో పవన్‌కల్యాణ్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కుతున్నదని మేకర్స్ తెలిపారు. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో అశుతోష్ రానా, నవాబ్షా, గౌతమి ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: ఆనంద్‌సాయి, రచన-దర్శకత్వం: హరీష్‌శంకర్.