Ustaad Bhagat Singh | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలలో ఒకటి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). ఈ సినిమాకు గబ్బర్ సింగ్ ఫేమ్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. 2022లోనే మొదలైన ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వలన వాయిదా పడింది. ఆ తర్వాత మళ్లీ పట్టాలెక్కలేదు. దీంతో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇదిలావుంటే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ వైరల్‌గా మారింది.
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించడానికి ఏకంగా రూ. 170 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. టాలీవుడ్లో అల్లు అర్జున్ తర్వాత ఇప్పటివరకు ఏ హీరో కూడా ఇంత మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయలేదని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ వార్తపై సినిమా నిర్మాతల నుంచి ఏదో ఒక క్లారిటీ వస్తే కానీ ఈ వార్తలకు ముగింపు ఉండదు.