Ustaad Bhagat Singh | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తను కమిటైన సినిమాలని పూర్తి చేస్తూ వస్తున్నాడు. ముందుగా హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ రీసెంట్గా ఓజీ కూడా పూర్తి చేశాడు. ఈ రెండు చిత్రాలు డిఫరెంట్ జానర్స్‌లో రూపొందగా, అవి ప్రేక్షకులకి పిచ్చెక్కించడం ఖాయం. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని కూడా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వస్తున్నారు. తాజాగా మైత్రి మూవీ మేకర్స్ ఓ వీడియో విడుదల చేస్తూ పవన్ కళ్యాణ్ సెట్లో అడుగుపెట్టినట్టు తెలియజేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్‌గా కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. జూన్ 10 నుండి షూట్ మొదలు కాగా, ఈ రోజు పవన్ జాయిన్ అయినట్టు తెలుస్తుంది. వీడియోలో మనం శ్రీలీలని కూడా గమనించవచ్చు.
గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రానికి ఫేమస్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆయనంక బోస్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్. రామ్-లక్ష్మణ్ ద్వయం యాక్షన్ సీక్వెన్స్‌లను కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఆనంద్ సాయి ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తుండగా, స్క్రీన్ ప్లే రైటర్ గా కె. దశరథ్ , అడిషినల్ రైటర్ గా సి చంద్ర మోహన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
తొలి షెడ్యూల్ 30 రోజుల పాటు నాన్‌స్టాప్‌గా జరగనుందట. ఈ షెడ్యూల్ లో ప్రధాన పాత్రధారులకి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది. రీసెంట్ గా రాబిన్‌హుడ్ సినిమాతో ఫ్లాపును మూట గట్టుకున్న శ్రీలీల ఉస్తాద్ భగత్ సింగ్‌పై చాలానే ఆశలు పెట్టుకుంది. దాంతో పాటూ ఫ్లాపులో ఉన్న శ్రీలీలకు ఇప్పుడు హిట్ అవసరం చాలానే ఉంది. ఈ చిత్రాన్ని శ్రీలీల తన కెరియర్ స్టార్టింగ్‌లో ఒప్పుకుంది. ఈ చిత్రంతో తన ఫేట్ మారిపోతుందని శ్రీలీల అనుకుంది. కాని పలు కారణాల వలన మూవీ ఆగింది. అయితే మధ్యలో శ్రీలీల చేసిన కొన్ని సినిమాలతో ఆమెకి మంచి స్టార్డమ్ వచ్చింది. ఇటీవల వరుస ఫ్లాపులతో శ్రీలీల కెరియర్ డైలమాలో పడింది. అయితే కెరీర్ లో మరింత ముందుకెళ్లడానికి అర్జెంటుగా ఈ సినిమా హిట్ అవసరం. ఉస్తాద్ భగత్ సింగ్ హిట్ అయితే శ్రీలీల మార్కెట్ పెరగడం ఖాయం.
Iss baar sirf Aandhi nahin, toofan hain 💥🌪️
POWER STAR @PawanKalyan joins the sets of #UstaadBhagatSingh ❤🔥
Shoot in progress. Stay tuned for more updates.
@harish2you @sreeleela14 @ThisIsDSP @DoP_Bose #UjwalKulkarni @SonyMusicSouth @UBSthefilm pic.twitter.com/CPFTdLrBHl— Mythri Movie Makers (@MythriOfficial) June 11, 2025