‘ఓజీ’తో బాక్సాఫీస్‌ని షేక్ చేశారు పవన్‌కల్యాణ్. ఆయన నెక్ట్స్ మూవీ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌ని వేగవంతం చేశారు. ఈ నెల 9న ఈ సినిమాలోని తొలిపాట ప్రోమోను విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఈ పాటలో నర్తిస్తున్న పవన్‌కల్యాణ్ స్టిల్‌ని మేకర్స్ విడుదల చేశారు. బ్లాక్ సూట్, బ్లాక్ క్యాప్‌తో మైకేల్ జాక్సన్‌ని తలపిస్తున్న పవన్‌కల్యాణ్‌ని ఈ పోస్టర్లో చూడొచ్చు.
‘మీరు అమితంగా ప్రేమించే పవర్‌స్టార్‌ని మీరు కోరుకునేలా అందించనున్నాం. మునుపెన్నడూ చూడని కొత్త పవన్‌కల్యాణ్‌ని ఇందులో చూస్తారు.’ అంటూ మేకర్స్ పోస్టర్‌తోపాటు పేర్కొన్నారు. శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి హరీశ్‌శంకర్ దర్శకుడు. సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: ఆనంద్‌సాయి, నిర్మాణం: మైత్రీమూవీమేకర్స్.