Ustaad Bhagat Singh | ఈ రోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నంత ఆనందంగా ఎవ్వరూ లేరేమో. అర్ధరాత్రి హరిహర వీరమల్లు పోస్టర్‌ను చూసి కానీ అభిమానులు పడుకొలేరు. అలా పడుకుని లేచారో లేదో.. ఓజీ టీజర్ ప్రత్యక్షమయింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి టీజర్ అయితే నెవర్ బిఫోర్. ఒక టీజర్‌తో అంచనాలు ఆకాశానికెత్తేయొచ్చు అని సుజీత్ మ్రాతమే ప్రూవ్ చేశాడు. ఇప్పటివరకు ఎన్నో టీజర్ కట్లను చూశాం కానీ.. వాటిలో టాప్ ప్లేస్‌లో ఇదుంటుంది. పవన్ ఫ్యాన్సనే కాదు.. యాంటీ ఫ్యాన్స్ సైతం ఏముందిరా టీజర్ అని అనుకుంటున్నారు. సుజీత్ పొరపాటున బయట కనిపిస్తే పవన్ ఫ్యాన్స్ పూజలు, పురస్కారాలు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతలా అభిమానులను ఆనందపు అంచుల్లో నిలబెట్టాడు.
ఇప్పటికీ అదే హైలో ఉన్న పవన్ ఫ్యాన్స్‌కు మరో లడ్డు కావాలా నాయనా అనే రేంజ్లో ఉస్తాద్ నుంచి పోస్టర్ రిలీజైంది. చేతిలో రక్తంతో తడిసిన కత్తిని పట్టుకొని కూర్చున్న పవన్ పోస్టర్ వీర లెవల్లో ఉంది. పోస్టర్‌తో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. ఓజీతో పాటు పవన్ ఈ సినిమాకు కూడా సమానంగా డేట్స్ ఇచ్చి.. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తేరీ రీమేక్ అంటూ గతంలో ప్రచారం వచ్చినా.. ఎప్పటికప్పుడు ఆ వార్తలను హరీష్ శంకర్ ఖండిస్తూనే వస్తున్నాడు. అయినా కానీ ఈ సినిమా లీక్స్‌ను బట్టి చూస్తే అది తేరీనే అని స్పష్టంగా తెలుస్తుంది. అయితే అందులో కోర్ పాయింట్ మాత్రమే హరీష్ తీసుకుని.. తన స్టైల్ ఆఫ్ మేకింగ్‌తో సినిమాను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది.
ముందుగా ఈ సినిమాను సంక్రాంతికి టార్గెట్‌గా పెట్టుకున్నా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ డేట్స్ అడ్జెస్ చేయడం కష్టం. దాంతో సినిమాను సమ్మర్‌కు ప్లాన్ చేస్తున్నారట. మైత్రీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చుతున్నాడు. ఈ సినిమాలో పవన్‌కు జోడీగా శ్రీలీల నటిస్తుంది. ఇక గద్దలకొండ గణేష్ తర్వాత హరీష్ నుంచి ఇప్పటివరకు సినిమా రాలేదు.
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే 😎🔥
Wishing our USTAAD of MASS and SWAG, @PawanKalyan garu a very Happy Birthday ❤️🔥#UstaadBhagatSingh 💥#HBDPawanKalyan @harish2you @sreeleela14 @ThisIsDSP @DoP_Bose #AnandSai @ChotaKPrasad @SonyMusicSouth @UBSTheFilm pic.twitter.com/qXPv9CAoOm
— Mythri Movie Makers (@MythriOfficial) September 2, 2023