హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 5 ( నమస్తే తెలంగాణ): ప్రతిష్టాత్మక ఫెలో ఆఫ్ ది యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీగా ప్రముఖ గుండె వైద్య నిపుణులు, స్టార్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్, సజ్జా హార్ట్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ లోకేశ్వరరావు సజ్జా ఎంపికయ్యారు.
కార్డియాక్ సర్జరీ, కరోనరీ రీవాస్యులరైజేషన్ పరిశోధనా రంగాల్లో లోకేశ్వర్రావు సజ్జా అందిస్తున్న విశిష్ట సేవలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. కార్డియోవాస్యులర్ వైద్య విభాగంలో అత్యున్నత వృత్తిపరమైన ప్రమాణాలు పాటించడంతోపాటు హృద్రోగ నివారణకు ఆయన చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఈ ఫెలోషిప్ ప్రదానం చేస్తున్నట్టు యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ ప్రకటించింది.