ఖమ్మం, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, వైఫల్యాలు, ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఆస్తుల ఆరోపణలను ముందుకు తెస్తున్నదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం విమర్శించారు.
టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో ఖమ్మంలో సోమవారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో తమ్మినేని మాట్లాడారు. హామీలను అమలుపర్చలేని కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ప్రజలకు ఒరిగిందేమీలేదని విమర్శించారు. రాష్ట్రం లో మూడో ఫ్రంట్‌కు అవకాశంలేదని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు.