‘కుటుంబం సహకరించడం వల్లే ఈ సినిమా చేయగలిగాను. ధ్రువన్ సంగీతం, సతీశ్ ఛాయాగ్రహణం ఈ సినిమాకు ప్లస్. తన్వీ భవిష్యత్‌లో పెద్ద హీరోయిన్ అవుతుంది. మా అబ్బాయి శ్రీకమల్ కెరీర్‌కు ఈ సినిమా గట్టి పునాదిని ఇస్తుందని నమ్ముతున్నా’ అని కె. విజయభాస్కర్ అన్నారు. ఆయన స్వీయదర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఉషాపరిణయం’. విజయభాస్కర్ కుమారుడు శ్రీకమల్ ఇందులో కథానాయకుడు. తాన్వీ ఆకాంక్ష కథానాయిక. ఆగస్ట్ 2న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ వేడుకలో కె.విజయభాస్కర్ మాట్లాడారు. ఈ వేడుకకు అతిథిగా విచ్చేసిన మెగా హీరో సాయిదుర్గతేజ్ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. తన తండ్రి విజయభాస్కర్ తనకు దైవంతో సమానమని, ఆయన పేరును నిలబెట్టడానికి ప్రయత్నిస్తానని శ్రీకమల్ చెప్పారు. మంచి పాత్రతో ప్రోత్సహించిన దర్శక,నిర్మాత కె.విజయభాస్కర్‌కు తాన్వీ ఆకాంక్ష కృతజ్ఞతలు తెలిపింది. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులందరూ మాట్లాడారు.