సకుటుంబ కథా చిత్రాలతో ప్రత్యేకతను సంపాదించుకున్న సీనియర్ దర్శకుడు కె.విజయ్‌భాస్కర్ తెరకెక్కిస్తున్న ప్రేమకథా చిత్రం ‘ఉషా పరిణయం’. ‘లవ్ ఈజ్ బ్యూటీఫుల్’ ఉపశీర్షిక. శ్రీకమల్, తాన్వీ ఆకాంక్ష జంటగా నటిస్తున్నారు. వాలెంటైన్ డే సందర్భంగా బుధవారం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ‘టాకీ పార్ట్ పూర్తయింది. త్వరలో విదేశాల్లో పాటలను చిత్రీకరించబోతున్నాం.
ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంటుంది. వినోదానికి పెద్దపీట వేస్తూ రూపొందిస్తున్నాం’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సతీష్ ముత్యాల, సంగీతం: ఆర్.ఆర్. ధృవన్, నిర్మాణ సంస్థ: క్రాఫ్ట్ ప్రొడక్షన్, నిర్మాత, దర్శకత్వం: కె.విజయ్‌భాస్కర్.