Urvashi Rautela | బాలీవుడ్ (Bollywood) అందాల భామల్లో ముందువరుసలో ఉంటుంది ఊర్వశి రౌటేలా (Urvashi Rautela). ఈ భామ సోషల్ మీడియాలో ఫొటో పెట్టిందంటే చాలు లైక్స్, కామెంట్ల వర్షం కురుస్తుంది. మెస్మరైజింగ్ డ్యాన్స్‌తో అందరినీ కట్టిపడేసే టాలెంట్ ఊర్వశి సొంతం. సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉండే ఈ భామకు సంబంధించిన హాట్ న్యూస్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఊర్వశి రౌటేలా ఖరీదైన ఇంటిలోకి మారిందన్న వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
ప్రముఖ నిర్మాత యశ్ చోప్రా ఇంటి పక్కనే సుమారు రూ.190 కోట్ల విలువైన విల్లాలోని మారిందన్న న్యూస్‌పై బీటౌన్ లో జోరుగా టాక్ నడస్తోంది. ముంబై నడిబొడ్డున ఉన్న ఈ అద్భుతమైన భవనం విశాలమైన, విలాసవంతమైన తోట, వ్యక్తిగత వ్యాయామశాల, అందమైన ఇంటీరియర్ డిజైన్లతో స్వర్గాన్ని తలపించేలా ఉందట. యశ్‌చోప్రా గార్డెన్ ఏరియాకు అనుబంధంగా ఉన్న సువిశాలమైన తోట ఈ ఇంటికి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందట.
ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాలో బాస్ పార్టీ సాంగ్‌తో సిల్వర్ స్క్రీన్‌ను షేక్ చేసింది ఊర్వశి రౌటేలా. ఈ భామ ప్రస్తుతం బోయపాటి శ్రీను-రామ్ పోతినేని కాంబోలో వస్తున్న RAPO20లో మరోసారి స్పెషల్ సాంగ్‌లో మెరవనుంది. ఇటీవల, ఊర్వశి రౌటేలా ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెడ్ కార్పెట్‌పై హొయలుపోతూ అదిరిపోయే లుక్స్‌తో అంతర్జాతీయ వేదికపై తళుక్కున మెరిసింది. ప్రస్తుతం ఈ భామ ఖాతాలో Dil Hai Gray, Black Rose ప్రాజెక్టులున్నాయి.