Urvashi Rautela | బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌కి క్షమాపణలు తెలిపింది నటి ఊర్వశీ రౌతేలా. నేను మీ గురించి ఇలా మాట్లాడినందుకు సిగ్గుపడుతున్నాను అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. సైఫ్ అలీఖాన్ మీద దుండగులు దాడి జరిపిన విషయం తెలిసిందే. గత గురువారం తెల్లవారుజామున ముంబై బాంద్రాలోని ఆయన నివాసంలోకి చొరబడిన దుండగుడు కత్తితో సైఫ్‌పై దాడి చేశాడు. దీంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నాడు సైఫ్. అయితే సైఫ్ ఘటనపై బాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
అయితే ఈ విషయంపై నటి ఊర్వశీ రౌతేలా మీడియాతో స్పందిస్తూ.. సైఫ్‌పై దాడి దురదృష్టకరం. నేను ప్రస్తుతం డాకు మహరాజ్ సక్సెస్ మూడ్‌లో ఉన్నాను. ఇప్పటివరకు రూ.105కోట్లు వసూళ్లు సాధించింది. ఈ సినిమా సక్సెస్ అయినందుకు మా అమ్మ నాకు డైమండ్ రింగ్ గిప్ట్గా ఇచ్చింది. మా నాన్న రోలెక్స్ వాచ్ గిప్ట్గా ఇచ్చాడు. అయితే వీటిని ధరించాలంటే ఎవరైన దాడి చేస్తారేమో అని ఇప్పుడు భయమేస్తుంది. అంటూ చెప్పుకోచ్చింది. అయితే రింగ్ ఇచ్చిందంటూ మీడియాకి చూపించడం.. అలాగే ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. సైఫ్ అలీఖాన్ చావు బ్రతుకుల మధ్య ఉంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటూ ఊర్వశీపై నెటిజన్లు దుమ్మెత్తిపోశారు.
దీంతో తాజాగా ఈ విషయంపై ఊర్వశీ సైఫ్‌కు క్షమాపణలు తెలిపింది. సైఫ్ సర్ ఈ సందేశం మీకు అందుతుందని ఆశిస్తున్న. మీ గురించి మాట్లాడే క్రమంలో నేను ప్రవర్తించిన తీరుపై నాకు సిగ్గుగా ఉంది. ఈ విషయంలో మీకు క్షమాపణలు తెలుపుతున్నా. ఇంటర్వ్యూ ఇచ్చే టైంలో మీపై జరిగిన దాడి ఎంత సీరియస్ అనేది నాకు పూర్తిగా తెలియదు. నేను ఒక సినిమా సక్సెస్‌లో మూడ్‌లో ఉండి.. ఆ సినిమాకి వచ్చిన గిప్ట్‌ల గురించి మాట్లాడాను ఈ విషయంలో సిగ్గుపడుతున్నా అంటూ ఉర్వశీ రాసుకోచ్చింది.
Reporter: “Saif Ali Khan got stabbed. What do you have to say about this?”
Urvashi Rautela: “Yes, after Daaku Maharaj crossed 105 crores, my mom gifted me this diamond Rolex watch, and my dad gave me this mini watch!” 🥲
— Aaraynsh (@aaraynsh) January 17, 2025
#UrvashiRautela has out of the blue posted a long apology to #SaifAliKhan, who is recuperating from being stabbed inside his house in Mumbai, and has promised to ‘do better’. Are you as confused as we are? #urvashirautela #saifalikhan #bollywood pic.twitter.com/aHU5sP10dD
— HT City (@htcity) January 17, 2025