Urvashi Rautela | ‘బాస్ వేర్ ఈజ్ ద పార్టీ’ అంటూ వాల్తేరు వీరయ్య సినిమాలో స్పెషల్ సాంగ్‌తో కుర్రకారును పిచ్చెక్కించిన నటి గుర్తుందా? తాజాగా ‘బ్రో’ చిత్రంలో ‘ఎంటర్టైన్మెంట్కు గ్యారెంటీ ఇస్తా’ అంటూ సిత్ర మంజరి వేసిన చిందులు ఎలా మర్చిపోగలం. ఇప్పటివరకు తెలుగులో మూడు ప్రత్యేక గీతాలతో యూత్ మూడ్‌ను హిట్ చేసిన ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా. 2015లో విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్న హరిద్వార్ సొగసరి సామాజిక మాధ్యమాల్లో నిత్యం వైరల్ అవుతూనే ఉంటుంది.
బాలీవుడ్లో నా జర్నీ సరిగ్గా పదేండ్ల కిందట మొదలైంది. వేళ్ల మీద లెక్కపెట్టినన్ని సినిమాలే చేసి ఉండొచ్చు. వాటిలో కొన్ని స్పెషల్ అపియరెన్స్ పాత్రలే కావొచ్చు! కానీ, నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నానని బలంగా నమ్ముతున్నా. కామెడీ, కమర్షియల్ మూవీస్‌లో కనిపించాను. మొగల్-ఎ-ఆజమ్ లాంటి చారిత్రక సినిమా చేయాలని ఉంది. ‘టైటానిక్’ లాంటి రొమాంటిక్ సినిమా, ‘మదర్ ఇండియా’ తరహా గొప్ప చిత్రాల్లో
నటించాలని ఉంది. నేను కోరుకున్న పాత్రలు నన్ను వరిస్తాయని నమ్మకంతో ఉన్నా!
కేవలం అందంగా ఉన్నంత మాత్రాన మోడలింగ్‌లో రాణించేయొచ్చు అనుకుంటే పొరపాటు! మన మీద మనకు అపారమైన నమ్మకం ఉండాలి. ఈ రంగంలో రోజూ కొత్త కొత్త సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. చూద్దాంలే, చేద్దాంలే అనుకుంటే కుదరదు. రంగంలోకి దిగాక ఆత్మవిశ్వాసంతో దూసుకుపోవాల్సిందే!
హైదరాబాద్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఈ నగరంతో నాకెంతో అనుబంధం ఉంది. ‘మిస్ యూనివర్స్’ పోటీల తొలి రౌండ్లు ఇక్కడే జరిగాయి. వాటిలో విజేతగా నిలిచాను. ఒక్కో రౌండ్ దాటుకుంటూ చివరికి విశ్వసుందరి కిరీటం అందుకున్నా!
దక్షిణాది చిత్రాల్లోనూ అవకాశాలు వస్తున్నాయి. కన్నడం, తమిళంలో లీడ్ క్యారెక్టర్లు పోషించాను. ‘వాల్తేరు వీరయ్య’ నా మొదటి తెలుగు చిత్రం. ‘ఏజెంట్’, ‘బ్రో’ సినిమాల్లోనూ ప్రత్యేక గీతాల్లో నర్తించి తెలుగు
ప్రేక్షకులను మెప్పించా. భవిష్యత్ గురించి ముందుగానే ఊహించడం కష్టమే కానీ, తెలుగులో మంచి సినిమా అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తాను.
ర్యాంప్ వాక్ అంటే నాకు కేక్వాక్ అంత ఈజీ అనిపిస్తుంది. మోడలింగ్ నుంచి రావడంతో అదేం పెద్ద ఇబ్బంది అనిపించదు. నటన అంటేనే కాస్త కష్టంగా అనిపిస్తుంది. యాక్టింగ్‌లో నా జర్నీ ఇప్పుడే కదా మొదలైంది. ఇంకా చాలా ప్రయాణించాల్సి ఉంది! వెండితెర మీద కూడా నేనేంటో రుజువు చేసుకుంటా! ఈ ఏడాది వరుసగా అవకాశాలు వస్తున్నాయి. కొన్ని స్క్రిప్టులు బాగా నచ్చాయి. త్వరలోనే వివరాలు మీకూ తెలుస్తాయి.
పెండ్లిసందడి అంటే నాకు చాలా ఇష్టం. నా పెండ్లి గురించైతే చాలా కలలున్నాయి. మరీ ఇంత ఫాంటసీ ఏంటో అనుకోకండి! నా వరకైతే ఏడు రకాలుగా పెండ్లి చేసుకోవాలని ఉంది. బీచ్‌లో ఒకసారి, బెంగాలీ సంప్రదాయంలో మరోసారి, క్రూజ్‌లో ఇంకోసారి, క్రైస్తవ పద్ధతిలో, హిందూ సంప్రదాయ పద్ధతిలో, థీమ్ బేస్డ్గా, డెస్టినేషన్ వెడ్డింగ్.. ఇలా సెవన్ వండర్స్ ఆస్వాదించాలని ఉంది.
నా సరిజోడును కనుక్కోవడం కష్టమైన పనే! జీవిత భాగస్వామి విషయంలో నాకు కొన్ని కచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. అందంతోపాటు తెలివితేటలు ఉండాలి. ప్రపంచం మీద కనీసం అవగాహన ఉండాలి. ముఖ్యంగా సెన్స్ ఆఫ్ హ్యూమర్తోపాటు ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగి ఉండాలి. వాడే నా వాడు.
“Urvashi Rautela | నిమిషానికి కోటి రూపాయలా?.. ఏ ఊరు తల్లీ నీది… అబద్దమాడినా అతికినట్లుండాలి..!”