తేజస్ కంచర్ల హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఉరుకు పటేల’. ‘గెట్ ఉరికిఫైడ్’ ఉపశీర్షిక. వివేక్ రెడ్డి దర్శకత్వంలో బాలభాను నిర్మించారు. బుధవారం ఈ సినిమా టీజర్‌ను అడివి శేష్ విడుదల చేశారు. చిన్న టౌన్లో ఉండే ఓ అబ్బాయి బాగా చదువుకున్న అమ్మాయిని ప్రేమించడానికి చేసే ప్రయత్నాల నేపథ్యంలో టీజర్ వినోదాత్మకంగా సాగింది.
వినూత్నమైన కథతో ఈ సినిమాను రూపొందించామని, చక్కటి వినోదంతో పాటు అనూహ్య మలుపులతో ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. నేటి యూత్‌కి కనెక్ట్ అయ్యే కథాంశమిదని హీరో తేజస్ కంచర్ల తెలిపారు. కథలో కొత్తదనం ఆకట్టుకుంటుందని నిర్మాత బాల భాను తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.