తేజస్ కంచర్ల హీరోగా గ్రామీణ నేపథ్యంలో రూపొందిస్తున్న ప్రేమకథా చిత్రం ‘ఉరుకు పటేల’. వివేక్ రెడ్డి దర్శకత్వంలో కంచర్ల బాల భాను నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా నుంచి ‘పట్నం పిల్ల’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.
పట్నం నుంచి సెలవులకు పల్లెటూరికి వచ్చిన కథానాయికపై హీరో మనసు పారేసుకుంటాడు. అతని మనసులోని భావాలను వ్యక్తం చేసే పాట ఇదని, గ్రామీణ అందాల నేపథ్యంలో ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ పాటను కాసర్ల శ్యామ్ రచించగా, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతాన్నందించారు.