Urfi Javed | సినిమాలతో కంటే విభిన్నమైన డ్రెస్సింగ్‌తో పాపులారిటీ తెచ్చుకున్నది ఉర్ఫీ జావేద్. ఆమె లైఫ్‌ైస్టెల్ మిగిలిన నటులకన్నా భిన్నంగా ఉంటుంది. ‘ఫాలో కర్లో యార్’ టైటిల్‌తో ఆమె జీవిత కథ వెబ్ షోగా రూపొందింది. ఇది ‘అమెజాన్ ప్రైమ్’లో స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ సిరీస్ ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఉర్ఫీ.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సమంత గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
‘నేను చేసిన వీడియో నచ్చితే సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తుంది. దీని వెనుక ఆమెకు ఎలాంటి ఉద్దేశం ఉందని అనుకోవడం లేదు. ఆమెతో ఇన్‌స్టాగ్రామ్‌లో పలుసార్లు మాట్లాడాను. సమంత, నేను స్నేహితులం’ అని చెప్పుకొచ్చింది. అంతేకాదు, అర్జున్ కపూర్ అంటే తనకు చాలా ఇష్టమనీ, ఆయనపై ప్రేమ ఉందని కామెంట్ చేసింది. వెరైటీ డ్రెస్సులతో నిత్యం వార్తల్లో నిలిచే ఈ బ్యూటీ ముక్కుసూటిగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో రోజూ ట్రెండింగ్‌లో ఉంటుంది.