శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 26, 2021 , 15:34:00

థియేట‌ర్లలో ‌'ఉప్పెన‌' సంద‌డి..రిలీజ్ డేట్ ఫిక్స్..!

థియేట‌ర్లలో ‌'ఉప్పెన‌' సంద‌డి..రిలీజ్ డేట్ ఫిక్స్..!

ఉప్పెన‌..విడుద‌ల‌కు ముందే పాట‌ల‌తో సెన్సేష‌న్ సృష్టించిన విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఈ చిత్రం నుంచి విడుద‌లైన‌ పాటలు ప్రేక్ష‌కుల‌ను స‌రికొత్త ప్ర‌పంచానికి తీసుకెళ్తున్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా విడుద‌ల‌వుతుందా అని ఎదురుచూస్తున్న మూవీ ల‌వ‌ర్స్ కు చిత్ర‌యూనిట్ తీపిక‌బురు అందించింది. గ‌తేడాది ఏప్రిల్ 2న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సింది. కానీ క‌రోనా నేప‌థ్యంలో లాక్‌డౌన్ కార‌ణంగా రిలీజ్ ఆగిపోయింది.

ఫిబ్ర‌వ‌రి 12న సినిమాను విడుద‌ల చేయనున్న‌ట్టు మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. దేవీ శ్రీప్ర‌సాద్ కంపోజ్ చేసిన పాట‌లు, కృతిశెట్టి, వైష్ణ‌వ్‌తేజ్ న‌ట‌న, ఆక‌ట్టు‌కునే సంభాష‌ణ‌లు ప్ర‌తీ ఒక్క‌టి సినిమాపై ఆడియెన్స్ లో క్యూరియాసిటీని పెంచ‌డంలో కీ రోల్ పోషించాయి. విజ‌య్‌సేతుప‌తి విల‌న్‌గా న‌టిస్తున్నాడు. మంగ‌ళూరు భామ కృతిశెట్టి ఈ చిత్రంతో టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అవుతుంది.

ఇవి కూడా చ‌ద‌వండి..

‘ఉప్పెన’ వేగాన్ని ఆప‌త‌ర‌మా..!

ఎవ‌రి కోసం పుట్టానో చిన్న‌పుడే తెలిసిపోయింది..ఉప్పెన టీజ‌ర్

ఆరు మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ సొంతం చేసుకున్న ప్రభాస్


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo