కన్నడ అగ్రనటుడు ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న ఫాంటసీ చిత్రం ‘యూఐ’. జి.మనోహరన్, కె.పి.శ్రీకాంత్ నిర్మాతలు. డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా రిలీజ్‌డేట్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. ఉపేంద్ర పెద్ద గన్ పట్టుకుని డైనమిక్‌గా నిల్చున్న ఈ పోస్టర్ మాస్‌కి నచ్చేలా ఉంది. రీష్మా నానయ్య కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నిధి సుబ్బయ్య, మురళీశర్మ, పి.రవిశంకర్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: హెచ్‌సీ వేణుగోపాల్, సంగీతం: అజనీష్ బి.లోక్‌నాథ్.