Upcoming OTT Movies | గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన రామం రాఘవం(Ramam Raghavam), బాపు సినిమాలతో పాటు డ్రాగన్, జాబిలమ్మా నీకు అంత కోపమా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం సందడి చేస్తున్నాయి. ఇవే కాకుండా నాగ చైతన్య తండేల్తో పాటు ఛావా చిత్రాలు కూడా రాణిస్తున్నాయి. అయితే అయితే ఈ వారం ఏఏ సినిమాలు, థియేటర్‌కి రానున్నాయి ఏ సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి అనేది చూసుకుంటే.?
థియేటర్లోకి వచ్చే చిత్రాలివే
మజాకా
Mazaka Movie
నటుడు సందీప్ కిషన్, రీతు వర్మ జంటగా నటిస్తున్న తాజా చిత్రం మజాకా. ఈ సినిమాకు మాస్ మహారాజ రవితేజతో ధమాకా వంటి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు త్రినాధరావు తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే టీజర్‌తో పాటు ట్రైలర్‌ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇదిలావుంటే మహశివరాత్రి కానుకగా ఈ సినిమా ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. లవ్ & కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రానుండగా.. ఈ చిత్రంలో రావు రమేశ్, ‘మన్మథుడు’ ఫేమ్ అన్షు కీలక పాత్రలను పోషిస్తున్నారు.
శబ్దం
Sabdham
తమిళ నటుడు ఆది పినిశెట్టి, కోలీవుడ్ దర్శకుడు అరివళగన్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కాంబినేషన్లో రాబోతున్న తాజా చిత్రం ‘శబ్దం'(Sabdham). 15 ఏండ్ల క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ఈరం(తెలుగులో ‘వైశాలి’) తర్వాల మళ్లీ ఈ ముగ్గురి కాంబోలో ‘శబ్దం’ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో లక్ష్మీమీనన్ కథనాయికగా నటిస్తుండగా.. 7G ఫిల్మ్స్ సివా & ఆల్ఫా ఫ్రేమ్స్ బ్యానర్లపై అరివళగన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
శబ్దం సినిమా కథ విషయానికి వస్తే.. హారర్ – థ్రిల్లర్‌గా రాబోతుంది. ఇందులో శబ్దాలు (సౌండ్) కథలో కీలక పాత్ర పోషించనుండగా.. ఆది పినిశెట్టి ఇందులో ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ పాత్రలో కనిపించనున్నాడు. అతడు శబ్దాలకు అతీంద్రియ శక్తులతో ఉన్న సంబంధం ఏంటి అనే రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తాడు. ఇక ఇందులో కథానాయికగా నటిస్తున్న లక్ష్మీ మీనన్ పాత్ర ఒక వింతైన శబ్దాల అనుభవంతో బాధపడుతూ, ఆ రహస్యానికి కేంద్ర బిందువుగా ఉంటుంది.
అగాథియా
జీవా, అర్జున్ సర్జా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అగాథియా’. గీత రచయిత పా.విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఐసరి గణేష్ నిర్మాత. రాశీఖన్నా కథానాయిక. ఈ చిత్రం కూడా ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్వెల్ సినిమాల తరహాలో ఓ సరికొత్త ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లే చిత్రమిదని, మన సంస్కృతి, మానవ సంబంధాలు ప్రధానంగా కథ నడుస్తుందని, ఫాంటసీ హారర్ థ్రిల్లర్‌గా మెప్పిస్తుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి యువన్‌శంకర్ రాజా సంగీతాన్నందిస్తున్నారు.
తకిట తదిమి తందాన
యువ నటులు ఘన ఆదిత్య, ప్రియ జంటగా నటిస్తున్న చిత్రం ‘తకిట తదిమి తందాన’. రాజ్ లోహిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎల్లో మాంగో ఎంటర్టైన్మెంట్ పతాకంపై చందన్ కుమార్ కొప్పుల నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకురానుంది. అందమైన ప్రేమకథా చిత్రమిదని, వినోదప్రధానంగా ఆకట్టుకుంటుందని చిత్రబృందం పేర్కొంది.
ఓటీటీలోకి రాబోతున్న చిత్రాలు – వెబ్ సిరీస్‌లు
జియో హాట్‌స్టార్
సూట్స్ ఎల్ ఏ: (హాలీవుడ్) వెబ్‌సిరీస్ ఫిబ్రవరి 24
బీటిల్ జ్యూస్ : (హాలీవుడ్) ఫిబ్రవరి 28
లవ్ అండర్ కన్స్ట్రక్షన్ : (మలయాళం)ఫిబ్రవరి 28
ది వాస్ప్ (హాలీవుడ్) : ఫిబ్రవరి 28
నెట్‌ఫ్లిక్స్
డబ్బా కార్టెల్ (సిరీస్) ఫిబ్రవరి 28
అమెజాన్ ప్రైమ్
జిద్దీ గర్ల్స్ (సిరీస్) ఫిబ్రవరి 27
హౌస్ ఆఫ్ డేవిడ్ (సిరీస్) ఫిబ్రవరి 27
సుడల్2 (వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 28
Suzhal
సూపర్ బాయ్స్ ఆప్ మాలేగావ్ (హిందీ మూవీ) ఫిబ్రవరి 28
Super Boys Of Malegaon
ఎంఎక్స్ ప్లేయర్
ఆశ్రమ్ 3 (హిందీ సిరీస్) ఫిబ్రవరి 27