SSMB 29 | మహేశ్‌బాబు, రాజమౌళి కాంబినేషన్లో రూపొందనున్న సినిమా తొలి ప్రకటన కోసం దేశంలోని సినీప్రియులంతా ఎదురుచూస్తున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. తాజాగా ఈ సినిమా విషయంలో ఓ వార్త మీడియా సర్కిల్స్‌లో ఓ రేంజ్లో హల్చల్ చేస్తున్నది. ఈ సినిమాకు పనిచేస్తున్న ఓ విజువల్ ఆర్టిస్ట్ సోషల్ మీడియాలో ఓ ఆర్ట్ ఫ్రేమ్‌ను పోస్ట్ చేశాడు.
అది రెండు పక్షి రెక్కలతో కూడుకున్న ఆర్ట్ పిక్. దీంతో ఇప్పుడు రచ్చ మొదలైంది. మహేశ్, రాజమౌళి సినిమాను ఉద్దేశించే అతను ఈ పోస్ట్ పెట్టారని, ఆ సినిమా ‘గరుడ’ అనే టైటిల్‌తో రానున్నదని, గతంలో ఈ ‘గరుడ’ అనే టైటిల్ గురించి రాజమౌళి మాట్లాడారని, దాదాపు పదేళ్ల క్రితమే లాక్ చేసిన ఆ కథతోనే రాజమౌళి సినిమా తీయనున్నారని సోషల్ మీడియాలో వార్త తెగ వైరల్ అవుతున్నది.
అయితే.. అందుతున్న సమాచారం ప్రకారం ఆ విజువల్ ఆర్టిస్ట్ పోస్ట్ చేసిన ఆర్ట్ పిక్కూ, రాజమౌళి, మహేశ్ సినిమాకు ఏ మాత్రం సంబంధం లేదని తెలుస్తున్నది. ‘గరుడ’ రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టని, అది మూడువేల కోట్ల భారీ ప్రాజెక్ట్ అని, మహేశ్ సినిమా అమేజాన్ ఫారెస్ట్ ట్రజర్ హంట్ నేపథ్యంలో ఉంటుందని, ఇది కూడా దాదాపు 1500కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కనున్నదని, ఈ ఏడాది చివర్లో ఈ సినిమా వివరాలు ప్రకటించవచ్చని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.