రామ్ చరణ్ సతీమణి ఉపాసన నెటిజన్స్‌కి చాలా సుపరిచితం. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఉపాసన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ విషయాలు షేర్ చేస్తూ ఉంటుంది. యంగ్ ఎంటర్‌ప్రెన్యూయర్‌గా సత్తా చాటుతూ అపోలో లైఫ్ విభాగం వైస్ ఛైర్మన్‌గా కొనసాగుతున్న ఉపాసన నిత్యం సామాజిక కార్యక్రమాలు చేస్తూ శభాష్ అనిపించుకుంటూ ఉంటుంది.
తాజాగా ఉపాసన తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తన సోదరి అనుష్పాల కామినేని త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారనే విషయాన్ని తెలియజేసింది. అనుష్పాల కొద్ది రోజులుగా అథ్లెట్ అర్మాన్ ఇబ్రహీంతో ప్రేమలో ఉండగా, ఇటీవల వారి నిశ్చితార్థం పూర్తైంది. ఇప్పుడు పెళ్లి తేది ఫిక్స్ అయిందేమో ఏమో కాని వారి ఫోటో షేర్ చేస్తూ… ‘నా డార్లింగ్స్‌కి అభినందనలు’ అంటూ ఆమె పేర్కొన్నారు. దీంతో ఆ జంటకు తమన్నా, కాజల్, లక్ష్మీ మంచు, ఛార్మీ, అల్లు స్నేహా, శ్రియా భూపాల్, రకుల్ ప్రీత్ సింగ్ ఈ జంటకు విషెస్ తెలిపారు.
Congratulations my darlings.
— Upasana Konidela (@upasanakonidela) July 17, 2021
Match made in heaven 💍 @armaan_ebrahim & #anushpala pic.twitter.com/PM9l8N8PuI