రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఆరోగ్యం విషయంలో తను జాగ్రత్తలు తీసుకుంటూనే నలుగురికి మంచిని చేరవేసే ప్రయత్నం చేస్తుంటుంది. ఉపాసన సారథ్యంలో యువర్ హెల్త్ వెబ్ సైట్ విశేష ప్రాచుర్యం పొందుతోంది. దీని ద్వారా పలు టిప్స్ ఇస్తూ వస్తున్న ఉపాసన తాజాగా మరో క్రియేటివ్ వీడియోని ఇందులో షేర్ చేసింది. ఈ వీడియో ద్వారా వర్క్ ప్లేస్లో వెన్ను నొప్పి వస్తే దానిని ఎలా మేనేజ్ చేయాలో చూపించింది.
దుప్పటాతో సింపల్గా వెన్ను నొప్పి రాకుండా ఇలా మేనేజ్ చేయోచ్చు అంటూ ఉపాసన షేర్ చేసిన వీడియోకు ఫుల్ ఆదరణ లభిస్తుంది. గతంలో ఉపాసన.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సమంత, రష్మిక మంధాన, రకుల్ ప్రీత్ సింగ్ లతో ప్రత్యేక వీడియోలు రూపొందించగా, ఇందులో వారు హెల్తీ ఫుడ్ ఎలా చేసుకోవాలో తయారు చేసి చూపించిన విషయం విదితమే.
Here u go.
— Upasana Konidela (@upasanakonidela) April 16, 2021
Improve ur posture with a simple dupatta. https://t.co/vq6Q5RnQlg#fridayfitness #challenge #fridayfitnesschallenge @urlife_co_in pic.twitter.com/0dpmEJTnde