Upasana | టాలీవుడ్ బెస్ట్ కపుల్స్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన జంట ఒకటి. వారికి ప్రత్యేక స్థానం ఉంది. 2012లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట ఇప్పుడు ఇద్దరూ తమ కెరీర్ల్లో బిజీగా ఉన్నా, వ్యక్తిగత జీవితాన్ని ఎంతో అన్యోన్యంగా కొనసాగిస్తున్నారు. 2023 జూన్ 20న వారిద్దరికీ కుమార్తె పుట్టిన విషయం తెలిసిందే. పాపకు క్లింకార అని పేరు పెట్టారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఉపాసన కొణిదెల తమ వైవాహిక జీవితంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా హ్యాపీ మ్యారేజ్‌కి వీక్లీ డేట్ నైట్స్ ఎలా సహాయపడతాయో వివరించారు.
మా అమ్మ చిన్నప్పుడే ఒక విషయం చెప్పింది. బలమైన సంబంధాలకీ, హ్యాపీ మ్యారేజ్‌కి వీక్లీ డేట్ నైట్ చాలా అవసరం. ఈ మాట నేను ఇప్పటికీ పాటిస్తున్నా” అని చెప్పారు.డేట్ నైట్ అంటే ముస్తాబు అయి రెస్టారెంట్‌కి వెళ్లడం కాదు. ఇంట్లోనే ఇద్దరం ఒంటరిగా ఉంటాం. ఫోన్లు, టీవీలు పక్కన పెట్టి ప్రశాంతంగా మాట్లాడుకుంటాం. ఈ సమయం మాకు బలమైన భావోద్వేగ బంధాన్ని కల్పిస్తుంది అన్నారు. తన పర్సనల్, ప్రొఫెషనల్ జీవితంపై రామ్ చరణ్ ఎప్పుడూ మద్దతుగా ఉంటారని ఉపాసన వెల్లడించారు. కాగా, ఉపాసన ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ గ్రూప్ లో CSR వైస్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆరోగ్యంపై విస్తృత అవగాహన కల్పించే కార్యక్రమాల్లోనూ ఆమె ముందుండి పని చేస్తున్నారు. పలు సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు.
అయితే రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇప్పటికీ తమ కూతురు ఫేస్ రివీల్ చేయలేదు. ప్రతిసారి కూడా తమ కూతురి ఫేస్ కనిపించకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికి కారణం ఉపాసన తాజాగా తెలియజేసింది. ప్రపంచం ఇప్పుడు చాలా స్పీడ్ అయింది. ఎప్పుడు ఎలాంటి సంఘటన జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. కొన్ని సంఘటనలు మమ్మల్ని భయపెట్టడంతో మా పాపకి మేము ఫ్రీడమ్ ఇవ్వాలని అనుకుంటున్నాము. ఇప్పటికీ మేము బయటకి వచ్చినప్పుడు మా పాపకి మాస్క్ వేస్తాము. ఈ విషయంలో రామ్ చరణ్, నేను సంతోషంగానే ఉన్నాము. ఇప్పట్లో అయితే మేము మా పాప ఫేస్ రివీల్ చేయాలని అనుకోవడం లేదు అని కామెంట్ చేసింది ఉప్సీ.