Bhagyashree | బాలీవుడ్ సూపర్‌హిట్ చిత్రాల్లో ‘మైనే ప్యార్‌కియా’ ఒకటి. ‘ప్రేమ పావురాలు’గా తెలుగులోనూ విడుదలై.. ఇక్కడా హిట్ కొట్టింది. హీరో సల్మాన్‌ఖాన్‌తోపాటు హీరోయిన్ భాగ్యశ్రీని ఓవర్‌నైట్ స్టార్లను చేసింది. అయితే, ఈ సినిమాలో మొదట భాగ్యశ్రీకి బదులుగా ఉపాసన సింగ్‌ను అనుకున్నారట. ప్రస్తుతం స్టాండప్ కమెడియన్‌గా రాణిస్తున్న ఉపాసన.. జుదాయి, ఓ మై ఫ్రెండ్ గణేశా, జుడ్వా 2 వంటి బాలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నది.
తాజాగా, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘మైనే ప్యార్‌కియా’ నాటి సంగతులను పంచుకున్నది. ఈ చిత్రం కోసం డైరెక్టర్ సూరజ్ బడ్జాత్యా.. ముందుగా తననే ఎంపిక చేశాడట. ఆ తర్వాత కారణం చెప్పకుండానే.. తనను ఆ హిట్ చిత్రం నుంచి తొలగించారని వాపోయింది. ‘ముంబయికి వచ్చిన తర్వాత మైనే ప్యార్‌కియా దర్శకుడు సూరజ్‌ను కలిశాను. ఆ చిత్రంలో హీరోయిన్ సుమన్ పాత్ర కోసం నాకు ఆడిషన్ నిర్వహించి.. దాదాపు ఫైనల్ చేశారు. సినిమా గురించి, అందులో నా పాత్ర గురించి అన్ని విషయాలూ చర్చించారు. ఒకరోజు సూరజ్ తండ్రి, చిత్రనిర్మాత అయిన రాజ్‌కుమార్‌కు పరిచయం చేశారు. ఆ తర్వాతే.. కథ అనేక మలుపులు తిరిగింది. అనూహ్యంగా నన్ను ఆ సినిమా నుంచి తప్పించారు. కొన్నేళ్ల తర్వాత.. ఈ విషయాన్ని రాజ్‌కుమార్ బహిరంగంగా వెల్లడించారు.
‘మైనే ప్యార్‌కియా’లో సుమన్ పాత్ర కోసం నన్నే ముందుగా ఎంపిక చేసినట్టు తెలిపారు. అయితే, నా ఎత్తు కారణంగానే.. నన్ను ఆ హిట్ సినిమా నుంచి తొలగించినట్లు తెలిసి బాధపడ్డాను. నేను సల్మాన్‌ఖాన్ కన్నా పొడుగ్గా ఉన్నాననీ, అందుకే, నన్ను పక్కన పెట్టినట్టు చిత్ర నిర్మాత చెప్పారు!’ అంటూ నాటి సంగతులను గుర్తుచేసుకున్నది ఉపాసన సింగ్. జుడ్వా, మే ప్రేమ్‌కీ దీవానీ హూం వంటి చిత్రాలలో మంచి పాపులారిటీ సొంతం చేసుకుందీ పంజాబీ నటి. పలు టీవీ సీరియల్స్, షోలలోనూ అలరించింది.