Upasana Konidela | సోషల్ మీడియాలో ఉపాసన కొణిదెలకు ఎంతో ఫాలోయింగ్ ఉంది. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఉపాసన.. ఎప్పటికప్పుడు రామ్ చరణ్ సినిమాల గురించి ఆసక్తికర విషయాలు చెబుతుంటారు. దీనికి తోడు హెల్త్‌కు సంబంధించిన టిప్స్ కూడా ఇస్తుంటారు. ఈ క్రమంలో పెళ్లిళ్ల గురించి ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాలంటైన్స్ డే సందర్భంగా తమ పదేండ్ల వివాహ జీవితం గురించి మరోసారి గుర్తు చేసుకున్నారు ఉపాసన. ఈ నేపథ్యంలోనే రామ్‌చరణ్‌తో తన దాంపత్యం గురించి ఓపెన్ అయ్యారు.
ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలంటే వాళ్ల మధ్య ప్రేమ నమ్మకం ఉండాలి. మీకు ప్రియమైన వారితో మీ బంధం మరింత బలంగా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి అంటూ అభిమానులకు చెప్పుకొచ్చారు ఉపాసన. ముఖ్యంగా వివాహ బంధంలో ఆరోగ్యానికి చాలా ప్రాముఖ్యత ఉంటుందని తెలిపారు ఉపాసన. ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని క్రమం తప్పకుండా హెల్త్ టిప్స్ పాటించాలని సలహా ఇచ్చారు. పెండ్లిండ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయనేది నిజం కాదని.. భూమ్మీద ఇద్దరు వ్యక్తులు ఎంతో శ్రమిస్తే కానీ వివాహానికి నాంది పడదని తెలిపారు ఉపాసన.
ఎదుటి వ్యక్తిపై ప్రేమ, గౌరవం చూపిస్తేనే మీకు అవి మళ్లీ తిరిగి వస్తాయని చెప్పుకొచ్చారు. ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా డిన్నర్ డేట్, సినిమాలు చూడటం, కబుర్లు చెప్పుకోవడం ఇవన్నీ చేస్తే మీ జీవితం మరింత అందంగా మారుతుంది. మిస్టర్ సితో తన జీవితం అందంగా ఉండటానికి ఇంతకంటే వేరే టిప్స్ ఏవీ లేవని చెప్పారు ఉపాసన. మిమ్మల్ని ప్రేమించే వాళ్ల కోసం ఖచ్చితంగా సమయాన్ని కేటాయించడం అలవాటు చేసుకోండి అని ఈమె తెలిపారు. ఇలా చేస్తే కచ్చితంగా కలిసి ఉంటారు.. విడిపోయే సమస్య రాదని అంటున్నారు ఉపాసన. మరి మెగా కోడలు ఇచ్చిన టిప్స్ ఎంత మంది ఫాలో అవుతారో చూడాలి.