హైదరాబాద్ : బిజినెస్ ఉమెన్, సినీ నటుడు రామ్‌చరణ్ సతీమణీ ఉపాసన కొణిదెల అడ్వంచర్ ట్రిప్‌లో ఉన్నారా? ట్విట్టర్ వేదికగా తను తాజాగా పోస్టు చేసిన ఫోటో చూస్తే అవుననే అనిపిస్తుంది. లఢక్‌లోని లెహ్ అందాల ప్రకృతిలో దిగిన ఓ ఫోటోను ఆమె అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం తాను లెహ్‌లో ఉన్నట్లు తెలిపిన ఉపాసన తన తదుపరి అడ్వంచర్ ట్రిప్ ఎక్కడికో ఊహించగలరా అని నెటిజన్లను ప్రశ్నించింది. దీన్ని బట్టి ఆమె కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్తున్నట్లుగా మనం భావించవచ్చు.
మానస సరోవర్ యాత్ర భక్తశులభుడు, లయకారకుడు అయిన పరమేశ్వరుని స్థిరనివాసం. టిబెట్‌లో 22,028 అడుగుల ఎత్తులో ఉన్న కైలాస పర్వతం శివుని నివాసంగా భావిస్తాం. యాత్రికులు కఠినమైన పర్వతారోహణ తర్వాత కైలాస పర్వతం వద్ద పరిక్రమ చేస్తారు. మార్గంలో మానస సరోవర సరస్సు ఉంటుంది. దీనిలో మునక పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.
ఇంతవరకు యాత్రికులు ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ పాస్, సిక్కింలోని నాథులా అనే రెండు మార్గాల ద్వారా కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్తున్నారు. ఈ మార్గాల్లో నివాసయోగ్యం కాని పరిస్థితుల్లో 19,500 అడుగుల ఎత్తులో ట్రెక్కింగ్ ఉంటుంది. కాగా మానస సరోవర్ యాత్రకు ఈ రెండు మార్గాలే కాకుండా మరో మార్గం కూడా ఉంది. లెహ్ జిల్లాలోని డామ్చోక్ మీదుగా వెళ్లే సులభమైన మార్గం ఒకటుంది. ఈ మార్గం గుండానే ఉపాసన మానస సరోవర్ యాత్రకు వెళ్తున్నారా? ఏమో చూద్దాం. తాను తదుపరి షేర్ చేయబోయే ఫోటోలతోనైనా ఈ విషయం స్పష్టమౌతుందేమో.
Loads of Love from LEH
— Upasana Konidela (@upasanakonidela) August 1, 2021
Now on to my next adventure.
Any guesses ? pic.twitter.com/oX1q6LtbKr