Upasana Kamineni: ఆస్కార్స్ కోసం ప్రత్యేక చీరలో ఉపాసన.. ఆ శారీ స్పెషాల్టీ ఏంటో తెలుసా?
Upasana Kamineni: ఆస్కార్స్ రెడ్‌కార్పెట్‌పై ఉపాసన కొత్త లుక్‌లో కనిపించారు. ఆమె కట్టిన పట్టు చీర గురించి ఆమె తన ఇన్‌స్టాలో పోస్టు చేశారు. శారీని డిజైన్ చేసింది హైదరాబాదీనే అని, ఇక ఆమె మెడలోని నెక్‌పీస్ జ్వలరీని ముంబైలో డిజైన్ చేసినట్లు చెప్పారు.
హైదరాబాద్: హీరో రాంచరణ్ భార్య ఉపాసన(Upasana).. ఆస్కార్స్ వేడుక రెడ్‌కార్పెట్(Oscars redcarpet)లో తళుక్కుమన్న విషయం తెలిసిందే. అయితే ఆ ఈవెంట్ కోసం ఆమె ప్రత్యేక చీరను కట్టుకున్నారు. తెలంగాణకు చెందిన చేనేత కార్మికులే(handloom artisans) ఆ చీరను నేసినట్లు ఆమె చెప్పారు. వైట్ శారీలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన ఉపాసన .. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ప్రత్యేక చీర(silk saree) గురించి కొన్ని విషయాలు చెప్పారు.
ఆస్కార్స్ వేడుకలో దిగిన ఫోటోలను ఉపాసన తన ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ఇక సాంప్రదాయబద్ధంగా కనిపిస్తున్న ఆ చీర వెనుక ఉన్న వర్క్ గురించి ఆమె డిటేల్గా తన పోస్టులో వివరించారు. అకాడమీ అవార్డులకు కట్టుకున్న చీరను జయంతీ రెడ్డి(Jayanthi Reddy) డిజైన్ చేసినట్లు ఆమె చెప్పారు. ముంబైకి చెందిన బీనా గోయంక(Bina Goenka) కూడా జెమ్ వర్క్(Gem work) చేసినట్లు వెల్లడించారు.
డిజైనర్ జయంతీ రెడ్డిది హైదరాబాద్. హ్యాండ్లూమ్ కళాకారులు సిల్క్ శారీని నేసినట్లు చెప్పారు. రీసైకిల్ చేసిన స్క్రాప్(recycled scrap) నుంచి ఈ ఫ్యాషన్ శారీని డెవలప్ చేశారు. ఇక నెక్ పీస్(neck piece) గురించి ఉపాసన ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. చాలా సున్నితమైన లుక్‌లో ఉన్న ఆ నెక్ పీస్‌ని జ్వలరీ డిజైనర్ బీనా గోయంక తయారు చేసినట్లు చెప్పారు. ఆ డిజైన్ వర్క్ కోసం నాలుగేళ్లు పట్టిందట.
నెక్ పీస్ జ్వలరీ కోసం హయ్యెస్ట్ క్వాలిటీ నాచురల్ ముత్యాలను(pearls) వాడారు. ఇక 400 క్యారెట్ల హై క్వాలిటీ రూబీలు(rubi stones) వాడినట్లు కూడా ఆమె చెప్పారు. ఆస్కార్స్‌లో తనను అందంగా తీర్చిదిద్దేందుకు డిజైనర్లు, చేనేత కార్మికులు చాలా కష్టపడ్డారని, వాళ్ల డెడికేషన్, ప్యాషన్‌ను నిజంగా మెచ్చుకుంటున్నట్లు ఉపాసన తన పోస్టులో తెలిపారు.
ఉపాసన భర్త రాంచరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

