Upasana |టాలీవుడ్ మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, మెగా కోడలు ఉపాసన మళ్లీ తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఉపాసన తాను ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని షేర్ చేసి వెల్లడించింది. దీపావళి వేడుకలతో పాటు ఉపాసన సీమంతం కూడా జరిపినట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. వీడియోకు పెట్టిన క్యాప్షన్‌లో “డబుల్ సెలబ్రేషన్స్, డబుల్ లవ్ అండ్ డబుల్ బ్లెస్సింగ్స్” అని ఉపాసన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ సభ్యులు, బంధువులు హాజరై పాల్గొన్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో పలువురు సెలబ్రిటీలు, మెగా ఫ్యాన్స్ రామ్‌చరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
2023 జూన్‌లో రామ్‌చరణ్, ఉపాసనకు ‘క్లింకార’ జన్మించిన సంగతి తెలిసిందే. ఈసారి చిరంజీవికి మనవడు పుడతాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే ఉపాసన ఈ సారి కవలలకి జన్మనివ్వబోతున్నట్టు ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. క్లింకారకి తోడుగా మరో ఇద్దరు రాబోతున్నారట. ఈ విషయాన్ని మెగా కుటుంబ సన్నిహితులు లీక్ చేసినట్టు తెలుస్తుంది. రామ్ చరణ్, ఉపాసన దంపతులు కవలల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని వారు అన్నారు. గతంలో ఉపాసన ఒక ఇంటర్వ్యూలో రెండో సంతానం గురించి మాట్లాడుతూ, “మొదటి బిడ్డ విషయంలో ఆలస్యం చేశాం, కానీ రెండో సంతానం విషయంలో తప్పులు చేయాలనుకోవడం లేదు. మా డాక్టర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే రెండోసారి సంతానం కోసం సిద్ధంగా ఉన్నాను” అని తెలిపింది.
మరోవైపు ఉపాసన ఇప్పటికే సోషల్ మీడియాలో “డబుల్” అని హింట్ ఇచ్చింది. దీంతో కవలలకి జన్మినవ్వడం ఖాయం అంటున్నారు. ఉపాసన అందించిన గుడ్ న్యూస్‌తో పాటు కుటుంబం, మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవు. సింబా కోసం వెయిటింగ్ అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది రామ్ చరణ్ పెద్దితో సూపర్ హిట్ కొట్టడం, అలానే కవలలకి తండ్రి కావడం మెగా ఫ్యాన్స్‌కి పండగ వాతావరణం తీసుకురానుంది.