Upasana |ప్రస్తుతం మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఒకవైపు మెగా హీరోల సినిమాలు వరుసగా సూపర్ హిట్లు అందుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ ఇటీవల ‘ఓజీ’ సినిమాతో ఘన విజయం సాధించగా, చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకర్ వరప్రసాద్’ కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ కు ఎన్నో సంవత్సరాల తర్వాత ఇలాంటి సూపర్ హిట్లు రావడం అభిమానులను ఎంతో ఆనందపరిచింది. ఈ విజయాలతో మెగా అభిమానుల్లో డబుల్ సంబరాలు మొదలయ్యాయి. ఇలాంటి సంతోషకర వాతావరణంలో రామ్ చరణ్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ అందించారు.
రామ్ చరణ్ భార్య ఉపాసన ప్రస్తుతం గర్భవతి అని ఇప్పటికే తెలిసిందే. ఆమె డెలివరీ డేట్ ఎప్పుడు అనే విషయంలో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఉపాసనకు జనవరి 31న డెలివరీ జరగనుందని ప్రచారం జరుగుతోంది. దీని నేపథ్యంలో కొణిదెల కుటుంబంలో సందడి మొదలైనట్లు సమాచారం. మరోవైపు మెగా అభిమానులు కూడా ఈ వార్తతో తెగ ఆనందపడుతున్నారు. ఉపాసన ప్రెగ్నెన్సీ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన ఆనందాన్ని పంచుకుంటూ అభిమానులని పలకరిస్తూ వస్తున్నారు. డెలివరీ డేట్ దగ్గర పడుతున్న కారణంగా కుటుంబ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది.
రామ్ చరణ్ కూడా ఈ సమయంలో తన భార్యకు పూర్తి మద్దతుగా నిలుస్తున్నారని చెబుతున్నారు. షూట్‌కి కాస్త గ్యాప్ ఇచ్చి శ్రీమతితోనే చరణ్ ఉండనున్నాడని అంటున్నారు. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో ఉపాసనకు ట్విన్స్ పుట్టబోతున్నారని ప్రచారం జరిగింది. ఇది నిజమా కాదా తెలుసుకోవాలంటే డెలివరీ డేట్ వరకు వేచి చూడాల్సిందే. ఇప్పటికే రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు ఒక పాప ఉంది. గతంలో చిరంజీవి ఒక కార్యక్రమంలో తన ఇల్లు మొత్తం అమ్మాయిలతో నిండిపోయిందని, ఒక వారసుడు కావాలని రామ్ చరణ్‌ను సరదాగా అడిగినట్లు ఓ వీడియో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉపాసనకు పుట్టబోయే బిడ్డ ఆడా మగనా అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది. రామ్ చరణ్‌కు వారసుడు పుడతాడా లేక మరో పాపా అనే విషయం తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏదైనా సరే, కొణిదెల కుటుంబంలో మరో కొత్త అతిథి రానుండటం ఖాయం. ఈ శుభవార్తతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.