Unstoppable-3 | అన్‌స్టాపబుల్ షో బాలయ్యను అభిమానులను చాలా దగ్గర చేసింది. మాములుగా బాలయ్య అంటే ముక్కు మీద కోపం అని, ఊరికనే చిరాకుపడతాడని బయట జనం అనుకుంటుంటారు. కానీ పైకీ గంభీరంగా కనిపించినా.. బాలయ్యది చిన్న పిల్లాడి మనస్థత్వం అని ఇండస్ట్రీలో చెబుతుంటారు. నిజంగా బాలయ్య ఆఫ్ స్క్రీన్‌లో ఎంత సరదా మనిషో అన్‌స్టాపబుల్ షోతో క్లారిటీ వచ్చేసింది. తనకంటే పెద్ద వాళ్లను ఎలా గౌరవిస్తాడో.. చిన్నవాళ్లను అలానే ఆటపట్టిస్తుంటాడు. ఆ షోతో కొన్నేళ్లుగా బాలయ్యపై నెగెటీవ్ అభిప్రాయం ఉన్నవారు కూడా ఆయన్ని అభిమానించడం మొదలు పెట్టారు. అంతలా ఈ టాక్ షో జనాలను ఆకట్టుకుంది.
ఇక ఇప్పటికే రెండు సీజన్లను సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న ఈ టాక్ షో ఇప్పుడు మూడో సీజన్‌కు రెడీ అవుతుంది. ఈ సారి మరింత గ్రాండ్‌గా సీజన్-3 రూపొందుతుందట. ఇప్పటికే తొలి ఎపిసోడ్‌కు సంబంధించిన షూట్ కూడా పూర్తయిందని ఇన్సైడ్ టాక్. ఇక దసరా కానుకగా తొలి ఎపిసోడ్‌ను స్ట్రీమింగ్ చేయబోతున్నారని సమాచారం. రెండో సీజన్లో ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్లను తీసుకొచ్చిన గీతా ఆర్ట్స్ ఈ సారి ఏకంగా చిరంజీవినే దింపబోతున్నారట. అంతేకాకుండా ఎన్టీఆర్ కూడా మూడో సీజన్లో గెస్ట్‌గా రాబోతున్నట్లు తెలుస్తుంది.
ఇక లిమిటెడ్ ఎడిషన్ పేరుతో ఈ మూడో సీజన్‌ను స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అంతేకాకుండా అన్స్టాబబుల్లో ఇదే లాస్ట్ సీజన్ అని కూడా సమాచారం.
Yessss! You guessed it right. The BAAP OF ALL TALK SHOWS returns to entertain you all…🔥
Unstoppable with NBK, Limited Edition Coming Soon🤩#UnstoppableWithNBK #NBKOnAHA #UnstoppableWithNBK #NandamuriBalakrishna @ahavideoIN @Manepally18 @sprite_india #MansionHouse… pic.twitter.com/tUs6MODkcD— Vamsi Kaka (@vamsikaka) October 7, 2023